కండలు పెంచుతున్న సెక్సీ హీరోయిన్

adah sharma new movie

సినిమా పరిశ్రమ అన్న తరవాత ఎప్పుడు టైం కలిసొస్తుందో ఎప్పుడు కలిసి రాదో చెప్పలేని పరిస్థితి, ఎన్నో సంవత్సరాలుగా బాలీవుడ్ లో ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్ అదా శర్మ కి సరైన బ్రేక్ లేనే లేదు . తెలుగు లో హార్ట్ అటాక్ – సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు హిట్ అయినా ఆమెకి గుర్తింపు లేదు అసలు. హిందీలో క్షణం రీమేక్ కూడా ఆదానే హీరోయిన్ అన్నారు కానీ.. ఇంకా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు. కాకపోతే ప్రస్తుతం కమాండో2 అంటూ విద్యుత్ జమాల్ తో కలిసి ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేస్తోంది. ఈ మూవీ కోసం ఆదా శర్మ బాగానే కష్టపడుతోంది. యాక్షన్ సీన్స్ కూడా చేయాల్సిన అవసరం చాలానే ఉండడంతో.. అందుకు తగ్గట్లుగా ఒళ్లు వంచేస్తోంది. బాగా వర్కవుట్స్ చేసి పెంచిన కండలను చూపిస్తూ.. ఓ ఫోటో కూడా తీయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేసిందీ బ్యూటీ.

ఆర్మీ టీ షర్ట్ వేసుకుని.. కమాండో గాళ్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ.. చూస్తున్నారా నా కండలు అన్నట్లుగా పోజ్ ఇచ్చింది ఆదా శర్మ. ఫేస్ లో ఎంత రఫ్ నెస్ చూపిద్దామని ప్రయత్నించినా.. ఆదా మొహంలో కనిపించే అమాయకత్వం.. శరీరంలో కనిపించే సున్నితత్వం మాత్రం అలానే ఉన్నాయ్. ఆమెకు అవే అసలైన ఆభరణాలు కాబట్టి.. అలానే అడ్జస్ట్ అయిపోదాం.