పూరీ జగన్నాథ్ గారు నాకోసం చాలా కష్టపడ్డారు – హీరోయిన్

puri jagannath aditi arya

ఈ శుక్రవారం విడుదల అవ్వబోతున్న ఇజం సినిమాతో మిస్ ఇండియా 2015 గా ఎంపిక అయిన అదితి ఆర్య సినిమాల్లో అరంగేట్రం చెయ్యబోతోంది. ఈ శుక్రవారం విడుదల అవ్వబోతున్న ఈ సినిమాతో ఆమె కళ్యాణ్ రామ్ సరసన తెలుగు సినిమాలో కనిపిస్తుంది. ముంబై లోని ఒక ఏజెన్సీ ద్వారా అదితి ప్రొఫైల్ చూసిన పూరీ జగన్నాథ్ యూ ట్యూబ్ లో తన సినిమాలు చూపించి మరీ ఆమెని సినిమాకి ఒప్పించాడు అంటున్నారు.

‘ఇక్కడి సాంగ్స్.. మ్యూజిక్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. కాలేజ్ రోజుల్లో థియేటర్లలో డ్యాన్సులు వేసినప్పటి అనుభవాన్ని గుర్తు చేసుకుని మరీ చిందులేశా’ అంటున్న అదితి ఆర్య.. దర్శకుడు పూరీ జగన్నాధ్ చాలామంది హీరోయిన్ల ఫేట్ మార్చేశాడని తనకు తెలుసని.. తన విషయంలో కూడా మంచి ఫౌండేషన్ పడుతుందని ఆశిస్తున్నట్లు చెబుతోంది. మొదట్లో తెలుగు డైలాగ్స్ చెప్పడం బాగా ఇబ్బందిగా అనిపించేదట కానీ.. రాన్రాను తన డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేయడంతో.. మెల్లగా అలవాటు పడిపోయిందట అదితి. ఇక వన్ ఫిలిం వండర్ టైపులో ఇక్కడి నుంచి చెక్కేయాలని ఈ మిస్ ఇండియా అనుకోవడం లేదట. కొన్నేళ్ల పాటు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పిన అదితి.. అది జరగాలంటే తన తొలి మూవీ సక్సెస్ సాధించడం ముఖ్యం అని తెలుసంటోంది. కమర్షియల్ మూవీస్ నుంచి.. ఆర్టిస్టిక్.. ఆఫ్ బీట్ సినిమాలు కూడా తన కెరీర్ లో ఉండాలని కోరుకుంటున్న అదితి ఆర్య.. టాలీవుడ్ లో ఉన్న అందరు స్టార్ హీరోలతో చేసేయాలని ఉందంటూ.. తెలివి కూడా చూపించేసింది.