నందమూరి ఫాన్స్ కి సూపర్ న్యూస్ .. సంక్రాంతి కి అదరనున్న రికార్డులు!!

balayya gautamiputra satakarni

నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి 2017 సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చాలా భాగం పూర్తయిపోగా.. గ్రాఫిక్స్ వర్క్ కూడా మంచి స్పీడ్ మీద జరుగుతోంది. ఏకంగా 25 వీఎఫ్ ఎక్స్ కంపెనీలు శాతకర్ణికి విజువల్ గ్రాఫిక్స్ అందిస్తున్నాయి.

జనవరి 12న గౌతమి పుత్ర శాతకర్ణి విడుదల అంటూ.. గతంలోనే అనౌన్స్ చేశాడు దర్శకుడు క్రిష్. అయితే.. ఒకవేళ అనుకున్న క్వాలిటీ కనిపించకపోయినా.. పనులు పూర్తి కాకపోయినా.. వాయిదా వేసుకోవడంలో ఎలాంటి మొహమాటాలు ఉండవని కూడా ఓసారి చెప్పాడు క్రిష్. ఇదంతా విని శాతకర్ణి పోస్ట్ పోన్ అవుతుందేమో అనుకునేవారికి షాక్ ఇస్తూ.. ఈ చిత్రాన్ని రెండు రోజులు ముందుకు తెచ్చేస్తున్నారట. అనుకున్న సమయానికి దాదాపు 15-20 రోజుల ముందే గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ కాపీ చేతిలో ఉండేలా ప్రణాళికలు రూపొందించడం.. ప్లాన్ ప్రకారమే పనులు జరుగుతుండడంతో.. సంక్రాంతి సెలవలను పూర్తిగా ఉపయోగించుకునేలా శాతకర్ణిని విడుదల చేయనున్నారని తెలుస్తోంది. బాలయ్య మూవీ అనుకున్న తేదీకంటే ముందుగానే వస్తోందని తెలియడంతో.. నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు తెగ ఖుషీ అయిపోతున్నారు.

ఇలా రిలీజ్ డేట్ ను ముందుకు జరపాలంటూ అభిమానులు.. డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణిని ప్రీపోన్ చేయడం కారణంగా.. చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్150 విడుదల తేదీనే.. బాలయ్య మూవీ కూడా థియేటర్లలోకి రానుంది. సంక్రాంతి రేస్ ఇప్పుడు సూపర్బ్ గా మారిపోయిందంటున్నారు సినీ జనాలు.