మెగా స్టార్ చిరంజీవి 150 సినిమాకి షాకింగ్ బిజినెస్!!

chiru-150th-movie-pre-relea

మెగా స్టార్ చిరంజీవి 150 సినిమా విషయం లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ స్పీడ్ తో పూర్తి అవుతున్న తరుణం లో టైం గ్యాప్ ఉండదు అంటూ చిరు వేగంగా రావడానికి సిద్దం అవుతున్నాడు. 2017 సంక్రాంతి రిలీజ్ కి షెడ్యూల్ చేసిన ఈ మూవీకి ఇప్పటికే చాలా ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది. ఈ లెక్కలన్నీ చూస్తే.. ఖైదీ టార్గెట్ కరెక్టుగానే సెట్ అయిందే అనిపించకమానదు.

మొదటగా ఓవర్సీస్ డీల్ క్లోజ్ చేసిన నిర్మాత రామ్ చరణ్ 13.5 కోట్లకు దీన్ని ఫైనలైజ్ చేశాడు. వైజాగ్ ఏరియాకు 7.7 కోట్లు.. గుంటూరు 6.3 కోట్లు.. ఈస్ట్ 5.7 కోట్లు.. వెస్ట్ 5 కోట్లు.. కృష్ణా 5 కోట్లు.. నెల్లూరు 3.2 కోట్లు బిజినెస్ జరిగిందని.. నైజాం-సీడెడ్ లు కూడా కలుపుకుని మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారని అంటున్నారు. ఇది కాక ఇతర రాష్ట్రాల నుంచి మరో 20 కోట్లు రాబట్టాల్సి ఉంటుందట.