ఈ దశాబ్దపు గొప్ప సినిమాకి ట్రైలర్ ఎప్పుడంటే …!!

aamir-khan-dangal-movie

బాలీవుడ్ లో ఈ దశాబ్దం లోనే గొప్ప సినిమాగా దంగల్ గురించి చెబుతున్నాడు డైరెక్టర్ కరణ్ జోహారు. ఇంకా విడుదల కూడా కాని ఈ సినిమాకి తిరుగు లేదు అనీ ఈ చిత్రం కోసం ఆమిర్ పడిన కష్టం ఏంటో స్క్రీన్ మీద కనిపిస్తుంది అని కరణ్ మొన్ననే చెప్పాడు. ఆ తరవాత సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. మామూలుగానే అమీర్ సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. దీనికి తోడు ఈ వ్యాఖ్యలతో ‘దంగల్’పై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సినిమా ట్రైలర్ విడుదలకు రెండు నెలల ముందే వచ్చేస్తుండటం విశేషం. గురువారం నాడే ‘దంగల్’ ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ఇప్పట్నుంచే సోషల్ మీడియాలో దీని సందడి మొదలైపోయింది. అభిమానులు దీనిపై ట్వీట్లు గుప్పిస్తూ హైప్ పెంచేస్తున్నారు. మరి ఆ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. అంకిత్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమీర్ నలుగురు అమ్మాయిల తండ్రిగా నటిస్తున్నాడు. మహవీర్ పొగట్ అనే రెజ్లర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 23న ‘దంగల్’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.