దాసరిగారు… ఈసారి బాహుబలి మీద పడ్డారు!!

dasari-narayana-rajamouli

ఒక విషయంలో దాసరిగారిని అభినందించొచ్చు. చిన్నా పెద్దా తేడా లేకుండా పిలిచిన అన్ని సినిమా ఫంక్షన్స్‌కి అటెండ్ అవుతూ ఆయా సినిమాలకు ఎంతో కొంత పబ్లిసిటీ వచ్చేలా చేస్తూ ఉంటారు. కాకపోతే అప్పుడప్పుడూ ఆయన పర్సనల్ ఇష్యూస్‌ని కూడా పబ్లిసిటీ కింద వాడేసుకుంటూ ఉంటారు. ఆ విషయం పక్కన పెడితే చిన్న సినిమాల ప్రమోషన్స్ కోసం దాసరి లాంటి లెజెండరీ డైరెక్టర్ అటెండ్ అవడం మాత్రం ఆ నిర్మాతలకు చాలా చాలా కలిసొచ్చే విషయమే.

రీసెంట్‌గా అలాంటి ఓ ఫంక్షన్‌కి అటెండ్ అయిన దాసరి మీడియాపైన, రాజమౌళి తీసిన బాహుబలి సినిమాపైన బోలెడన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే ఆయన ఇంకా బ్లాక్ అండ్ వైట్ నాటి కాలంలో ఉన్నారా? అనిపిస్తోంది. మీడియా అంతా కూడా బాహుబలి లాంటి సినిమాలకు అయితే ఫ్రీగా అయినా పబ్లిసిటీ చేస్తోందని, చిన్న సినిమాలను మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చాడు దాసరి. అయితే ఇప్పుడుండేది ఆనాటి మీడియా కాదుగా. బాహుబలి బొమ్మ చూపిస్తే జనాలు చూశారు. బాహుబలి గురించి రాస్తే జనాలు చదివారు. అందుకే మీడియా కూడా తెలుగు సినిమా చరిత్రలోనే భారీ సినిమా అయిన బాహుబలిని అలా క్యాష్ చేసుకుంది. యాడ్ రెవిన్యూ పెంచుకుంది. అదే చిన్న సినిమాల గురించి రాస్తే ఎవరు పట్టించుకుంటారు? ఎవరు చూస్తారు? ఇప్పపుడసలు మీడియా ఎక్కడుంది? అంతా కూడా డబ్బుల వ్యవహారమే. డబ్బుల కోసం, పదవుల కోసం బినామీలతో, ఇంకా డైరెక్టుగా కూడా ఛానల్స్, పేపర్స్ పెట్టుకున్న మనీ బాబుల డబ్బు మీడియానేగా అంతా కూడా.