కళ్యాణ్ రామ్ కి పెరిగిన డిమాండ్.. వరుస కట్టారు!!

kalyan ram demand

ఒక్క సినిమా హిట్టయితే చాలు.. ఆ హీరో వెనుక పెద్ద పెద్ద దర్శకులే పరిగెడుతున్నారు. ఆ రేంజులో మనకు హీరోల కొరత ఉందా అంటే.. ఉందనే చెప్పాలి. సంవత్సరానికి 140 సినిమాలు వస్తున్నప్పుడు.. అందులో కేవలం 10 మాత్రం స్టార్ హీరోలవి.. మరో 5 చిన్న చిన్న స్టార్లవి. సో.. మిగతా సినిమాలన్నింటికీ హీరోలు కావల్సిందే. అదంతా పక్కనెట్టేస్తే ఇప్పుడు సిక్స్ ప్యాక్ హీరో కళ్యాణ్ రామ్ గురించే ఈ హడావుడి అంతా.

అసలు ఇజం సినిమా క్రిటికల్ సక్సెస్ ఎలా ఉన్నప్పటికీ.. సినిమాలో కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్ అండ్ లుక్ మాత్రం అదరిపోయాయ్. అందుకే ఇప్పుడు మనోడి తదుపరి సినిమా అంటే ప్రేక్షకులకు కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటుంది. అందుకే ఇప్పడు చాలామంది డైరక్టర్లు కళ్యాణ్ రామ్ కు కథ చెప్పాలని చూస్తున్నారట. ఒక ప్రక్కన ఆల్రెడీ అనిల్ రావిపూడి తనకు ఏ స్టార్ హీరో సెట్టవ్వకపోతే మాత్రం పటాస్-2 అంటూ కళ్యాణ్ రామ్ తోనే తీయాలని ఫిక్సయిపోగా.. మరో ప్రక్కన ఖాళీగా ఉన్న దర్శకులు.. దేవ కట్టా అండ్ పరశురామ్ కూడా ఇప్పుడు స్టోరీ చెప్పడం కోసం ఈ హీరో ఎప్పాయింట్మెంట్ అడిగారట. ఒకవేళ పరశురామ్ కథ ఓకే చేయించుకుంటే ఆ సినిమాను గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మొత్తానికి డైరక్టర్లందరూ ఒక్క దెబ్బకి కళ్యాణ్ రామ్ వైపు చూస్తున్నారంటే.. అందరూ ఒక్కసారి ఆ సిక్స్ ప్యాక్ కు.. అలాగే పూరి జగన్ కు.. ఒక ‘ఓ’ వేస్కోండి మరి.