నన్ను చూసి మహేష్ బాబు షాక్ అయ్యాడు – హీరో

mahesh-babu-naveen

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచే వెండితెర కి హీరోగా పరిచయం అవుతున్న హీరో నవీన్ తన కొత్త సినిమా నందినీ నర్సింగ్ హోం గురించి చెప్పుకొస్తున్నాడు. బేసిక్ గా టెక్నీషియన్ అయిన నవీన్… నటన మీద వున్న ఇంట్రెస్ట్ తో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నవీన్ మీడియాతో ముచ్చటించాడు.

‘ఇంటర్మీడియట్లోనే నేను సినిమాల్లోకి రావాలనుకున్నా. దాంతో త్రీడీ యానిమేషన్ కోర్సు చేసి… ఎడిటింగ్ డిపార్ట్ మెంట్లో పనిచేశా. ఓ షార్ట్ ఫిలిం నన్ను ఎడిటింగ్ వైపు నడిచేలా చేసింది. చలి అనే ఓ షార్ట్ ఫిలింను తీసి… దర్శకుడు కృష్ణ వంశీకి చూపించా. దాన్ని చూసి ఆయన బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఎడిటింగ్ బాగా చేశావ్ అని మెచ్చుకున్నాడు. దాంతో అప్పటి నుంచి ఆయన డేంజర్ – రాఖీ చిత్రాలకు ఎడిటింగ్ డిపార్ట్ మెంట్లో పనిచేశా. అలా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చా. కుటుంబ సభ్యులు కూడా బాగా ప్రోత్సహించారు. ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ కాబట్టి… రాత్రింబవళ్లు మేల్కోవాల్సి వచ్చేది. టైంకి తిండి కూడా సరిగా తినలేకపోయేవాణ్ని. ఎప్పుడు పడితే అప్పుడు తినడం… పడుకోవడం వల్ల నా బరువు 130 కిలోలకు పోయింది. దాంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. డాక్టర్లు వెంటనే వృత్తినైనా మార్చుకో… లేదా.. టైంకి తిని పడుకో.. లేకుంటే.. నీ ఇష్టం అన్నారు. దాంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. యాక్టింగ్ వైపు దృష్టి సారిద్దాం అనుకున్నా.. వర్క్ అవుట్ స్టార్ట్ చేశాను.. అంత లావుగా..బరువుగా ఉన్న నన్ను ఆ మధ్య మహేష్ బాబు చూసి షాక్ అయ్యారు. వెరీ గుడ్ అంటూ ప్రశంసించారు.’ అన్నారు.