ఎన్టీఆర్ ముహుర్తం పెట్టేశాడు.. జై ఆడియో ప్రభంజనం ఆరోజునుండే..!

jai-lavakusa-audio-release

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవ కుశగా తన నట విశ్వరూపం చూపించడానికి డేట్ ఫిక్స్ చేశాడని తెలిసిందే. సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ ఎనౌన్స్ చేయగా ఇక ఇప్పుడు ఆ సినిమా ఆడియో రిలీజ్ డేట్ కూడా కన్ఫాం చేశారు దర్శక నిర్మాతలు. ఆగష్టు 12న జై లవకుశ ఆడియో రిలీజ్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పాటలు కూడా అదరగొట్టేస్తాయని అంటున్నారు. దేవి తారక్ కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు జై లవకుశ ఆల్బం కూడా అదే రేంజ్ లో ఉండబోతుందట.

సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తారక్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. జై టీజర్ తో ప్రభంజనాలు సృష్టించిన తారక్ మిగిలిన రెండు పాత్రలతో కూడా అదే రేంజ్ లో అలరిస్తాడని అంటున్నారు. సెప్టెంబర్ 21న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా తారక్ కెరియర్ లో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతుందని గట్టిగా చెబుతున్నారు ఫ్యాన్స్. ఈ ఆడియోకి స్పెషల్ గెస్ట్ ఎవరు ఏంటి అన్న విషయంపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు.