పూరీ ఇష్టం, కళ్యాణ్ రామ్ కష్టం…..హిట్టు బాటలో ఇజం

kalyam-ism-review-copy

నటీనటులుః నందమూరి కళ్యాణ్ రామ్, అదితి ఆర్య, జగపతిబాబు, తనికెళ్ళభరణి, గొల్లపూడి మారుతీరావు

మ్యూజిక్ః అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రాఫర్ ముఖేష్

ఎడిటర్ః జునైద్

ప్రొడక్షన్ హౌస్ః ఎన్‌టిఆర్ ఆర్ట్స్

ప్రొడ్యూసర్ః నందమూరి కళ్యాణ్ రామ్

కథ, కథనం, మాటలు, దర్శకత్వంః పూరీ జగన్నాథ్

రిలీజ్ డేట్ః 21.10.2016

ఇంట్రడక్షన్ః తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అందరు రైటర్స్ కంటే కూడా సూపర్ టాలెంటెడ్ రైటర్ పూరీ జగన్నాథ్ అని చాలా మంది నమ్మకం. అదే మాటను చాలా మంది క్రిటిక్స్, రాజమౌళి లాంటి సినిమా సెలబ్రిటీస్ కూడా చెప్పి ఉన్నారు. ఒక్క డైలాగ్‌తో బోలెడంత మైలేజ్ సంపాదించుకోగల సామర్థ్యం పూరీ సొంతం. కానీ సీరియస్‌గా వర్క్ చేయడన్నది పూరీ పైన కంప్లైంట్. అయితే రాను రాను పూరీ పెన్నులో ఇంక్ అయిపోయిందా? అన్న అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి. పోకిరి సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ సినిమా పూరీ నుంచి రాలేదు. ఆ మధ్య కాలంలో బిజినెస్ మేన్ ఒక్కటి మాత్రం కాస్త చెప్పుకోదగ్గ సినిమా. ఇక మిగతా ఆయన రచనలన్నీ ప్రేక్షకులకు మరోరకంగా దిమ్మతిరిగేలా చేసినవే. మరి ఇప్పుడు ఏకంగా ఓ కొత్త ‘ఇజం’ గురించి చెప్పబోతున్నానని మన ముందుకు వస్తున్నాడు. మరి ఆయన ఇజం ఎలా ఉంది? సినిమా కోసం కెరీర్‌లో ఎప్పుడూ లేనంత కష్టపడి సిక్స్ ప్యాక్ కూడా చేశానని కళ్యాణ్ రామ్ చెప్పాడు. మరి కళ్యాణ్ రామ్ కష్టానికి తగ్గ కాసుల వర్షం కురిసే రేంజ్ సినిమానూ పూరీ తీశాడా? హీరో కం ప్రొడ్యూసర్ కూడా అయిన కళ్యాణ్ రామ్‌కి ఈ ఇజంతో వచ్చే లాభం ఎంత? ఏంటి?

కథః పోకిరి తర్వాత నుంచి పూరీ జగన్నాథ్ సినిమాలో వచ్చిన ఏ కథలో మాత్రం భారీ కథలు ఉన్నాయి. ఓ చిన్న విషయం చుట్టూ కథనం అల్లుకుని సినిమాను తీసిపడేయడం పూరీ స్టైల్. ఇజంలో కూడా అంతే. కాకపోతే ఈ సారి పూరీ తీసుకున్న పాయింట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన వికిలీక్స్ ఎపిసోడ్ నుంచి ఇన్‌స్పైర్ అయిన పూరీ దానికి ఆసక్తికరమైన కథనాన్నే రాసుకున్నాడు. దేశంలో ఉన్న బడాబాబులు, రాజకీయ నాయకులు, క్రిమినల్స్ ఇంకా బోలెడుమంది….పూరీ భాషలో చెప్పాలంటే దొంగ నా కొడుకుల బాగోతాలన్నీ బయటపెడతాడు ఓ జర్నలిస్ట్. దెబ్బకు దేశం మొత్తం షాక్ అవుతుంది. అసలు ఆ బయట పెట్టిన జర్నలిస్ట్ ఎవడు? ఎందుకు చేశాడు? లీక్ చేయడంతో ఆగాడా? లేక అంతకుమించి అనేలా ఇంకేమైనా చేశాడా? ఆ జర్నలిస్ట్ లవ్ స్టోరీ ఏంటి? అనేది కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ః నందమూరి కళ్యాణ్ రామ్‌కి సినిమా అంటే ఎంత ప్యాషన్ ఉందనే విషయాన్ని ఈ ఇజం సినిమా మరోసారి నిరూపిస్తుంది. మన హీరోలు చాలా మంది అవసరం లేకపోయినా సిక్స్ ప్యాక్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఇజంలో మాత్రం హీరో చాలా ఫిట్‌గా ఉండాలి. అలాంటి క్యారెక్టరైజేషన్. ఆ క్యారెక్టర్ కోసం కళ్యాణ్ రామ్ పడిన కష్టం మొత్తం తెరమీద కనిపిస్తుంది. ఫిజికల్‌గా చాలా కష్టపడి సిక్స్ ప్యాక్ సాధించడంతో పాటు తన బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ స్టైల్‌ని కూడా పూర్తిగా మార్చేశాడు. అలాగే పూరీ రాసిన అద్భుతమైన డైలాగ్స్‌ని అంతే అద్భుతంగా పలికేశాడు. ఓవరాల్‌గా ఇజంలో ఉన్న జర్నలిస్ట్ క్యారెక్రర్‌కి వందశాతం న్యాయం చేశాడు. హీరోయిన్ అదితి ఆర్య బ్యూటిఫుల్‌గా ఉంది. అలాగే యాక్టింగ్ కూడా పూరీ సినిమాలలో ఉండే హీరోయిన్స్ స్టైల్‌లోనే బానే చేసింది. ప్రకాష్ రాజ్‌ని కాదనుకుని జగపతి బాబును తీసుకోవడం సినిమాకు ప్లస్ అయింది. గొల్లపూడి మారుతీరావు, పావలా శ్యామలా లాంటి వాళ్ళకు అవకాశమిచ్చిన పూరీని అభినందించాలి. వాళ్ళు సినిమాకు ప్లస్ అయ్యారు కూడా. అలాగే తనికెళ్ళ భరణి యాక్టింగ్ కూడా చాలా బాగుంది.

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ః పూరీ సినిమాల్లో ఉండే టెక్నికల్ బ్రిలియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? సూపర్బ్. ఫొటోగ్రాఫి, ఎడిటింగ్‌లు చాలా చాలా బాగున్నాయి. సినిమాకు ప్లస్ అయ్యాయి. అలాగే అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన సాంగ్స్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక పూరీ జగన్నాథ్ డైరెక్షన్ గురించి కొత్తగా చెప్పేదేముంది అద్భుతం. అలాగే డైలాగ్స్ కూడా కేకలు పెట్టించాయి. అయితే ఓ కొత్త పాయింట్ తీసుకున్న పూరీ క్యారెక్టరైజేషన్స్‌ని, సీన్స్‌ని మాత్రం కొత్తగా రాసుకోలేకపోయాడు. ఆయన ఇంతకుముందు తీసిన సినిమాలే చాలా గుర్తొస్తూ ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో హీరోయిన్ పైన వచ్చే పాట అయితే గోలీమార్ సినిమాలో మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు అనే పాటకు రీమేక్‌లా ఉంటుంది. అలాగే అలీ కామెడీ సీన్స్ కూడా యావరేజ్‌గా ఉన్నాయి. అస్సలు లాజిక్ లేకుండా పరమ సిల్లీగా ఉన్నాయి.

హైలైట్స్ః పూరీ జగన్నాథ్ డైలాగ్స్

కథ

కళ్యాణ్ రామ్

మ్యూజిక్

టెక్నికల్ బ్రిలియన్స్

ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్

డ్రాబ్యాక్స్ః కొత్త కథను తీసుకున్న పూరీ కొన్ని పాత సీన్స్ రాసుకోవడం

లాజిక్కులు లేకపోయినా ఒకె కానీ పూరీ రాసుకున్న పరమ సిల్లీ సీన్స్ మాత్రం సినిమా స్టాండర్డ్స్‌ని తగ్గించాయి.

ఎనాలసిస్ః పూరీ జగన్నాథ్ మారాడు. ఇజం సినిమా కోసం కాస్త ఎక్కువ కష్టపడ్డాడు. తన కెరీర్‌లోనే ఫస్ట్ టైం రీ షూట్ కూడా చేశాడు అని చాలా మంది చెప్తే ఇండస్ట్రీ జనాలు కూడా నమ్మలేదు కానీ అది నిజమే. లవ్ ట్రాక్, కామెడీ సీన్స్ విషయం పక్కన పెడితే కథకు ముఖ్యమైన సీన్స్ విషయంలో మాత్రం చాలా వర్క్ చేశాడు పూరీ. ఆ సీన్స్‌లో రాసుకున్న డైలాగ్స్ అయితే థియేటర్ దద్ధరిల్లిపోయేలా చేశాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఓ కమిటి ముందు కళ్యాణ్ రామ్ మాట్లాడే మాటలు అయితే థియేటర్‌లో కేకలు పెట్టించాయి. అలాగే ఇంటర్వెల్, ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ అన్నీ అద్భుతంగా అనిపిస్తాయి. వాటి కోసమైనా సినిమా చూడొచ్చు అనే రేంజ్‌లో ఉన్నాయి. సినిమాలో ఇంకా బోలెడన్ని హైలైట్స్ ఉన్నాయి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ కూడా అద్భుతంగా ఉంది. అయితే చాలా కొత్త పాయింట్ తీసుకున్న పూరీ సీన్స్ విషయంలో మాత్రం ఆ కొత్తదనం చూపించలేకపోయాడు. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం కొత్తగ రాసుకన్న పూరీ …హీరోయిన్, విలన్‌తో సహా పోసాని, అలీల క్యారెక్టర్స్‌ని పరమ రొటీన్‌గా రాసుకున్నాడు. అలీ, పోసానిల సీన్స్ అయితే పరమ సిల్లీగా ఉంటాయి. లాజిక్కులు లేకపోయినా ఫర్వాలేదు కానీ మరీ ఇలాంటి సిల్లీ సీన్స్ ఉంటే మాత్రం సినిమా స్టాండర్డ్స్ తగ్గిపోతాయి. అలాగే ఇజం లాంటి మంచి సినిమాలలో కూడా పోకిరి తర్వాత నుంచి పూరీకి బాగా అలవాటైన కొన్ని సీన్స్, క్యారెక్టరైజేషన్స్‌ని రిపీట్ చేయకుండా ఉండలేకపోతున్నాడు పూరీ. ఆ అలవాటు కొంత తగ్గించుకుని ఇజం సినిమాలో లాగా కొత్త పాయింట్‌తో పాటు కొత్త సీన్స్, కొత్త క్యారెక్టరైజేషన్స్ కూడా రాసుకుంటే మాత్రం పూరీ మరోసారి టాప్ లీగ్‌లోకి రావడం ఖాయం. అంతటి ప్రతిభ మనవాడి సొంతం మరి. ఈ ఇజం వరకూ మాత్రం నిర్మాతగా, హీరోగా కళ్యాణ్ రామ్‌కి ఓ హిట్ సినిమా పడినట్టే.

రేటింగ్ః 3.25/5

ఫైనల్ వర్డ్ః కళ్యాణ్ రామ్ కష్టం, టాలెంట్‌కి న్యాయం చేసిన పూరీ.