ఎన్టీఆర్ స్టార్ స్టేటస్…కళ్యాణ్ కామెంట్స్ ఆ వర్గంలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి

kalyan-ram-shocking-comment

ఇజం సినిమా ప్రమోషన్స్ యాక్టివిటీస్‌లో చాలా చాలా చెప్పేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా ఈ సినమాను ప్రమోట్ చేస్తున్నాడు. సిినిమాపైన మనవాడికి భారీ నమ్మకాలే ఉన్నట్టున్నాయి. సిక్స్ ప్యాక్ కోసం పడిన కష్టం, ఈ సినిమా కోసం పెట్టిన పెట్టుబడిలాంటివి అస్సలు వేస్ట్ అవకూడదని కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న కసిలో కళ్యాణ్ రామ్ ఉన్నాడు.

ఆ విషయం పక్కన పెడితే ఇజం సిినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ గురించి మనవాడు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్‌ని ఇమేజ్, స్టార్ స్టేటస్‌ని తాను కలలో కూడా పోటీగా భావించనని, ఎన్టీఆర్ సాధిస్తున్న విజయాలు నందమూరి వంశానికి గర్వకారణాలని చెప్పుకొచ్చాడు కళ్యాణ్ రామ్. నందమూరి వంశంలో కొన్ని విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కళ్యాణ్ రామ్ వ్యాఖ్యల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అలా చర్చిస్తున్న అందరూ కూడా ఎన్టీఆర్ స్టార్ స్టేటస్, నందమూరి వంశం హీరోలందరిలోకి మంచి పొజిషన్‌లో ఉన్న ఎన్టీఆర్ ఇమేజ్‌ని మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నారు.