ఒక్క రోజులో దేశాన్ని మార్చే సిఎం.. నాకు నేనే (తోపు-తురుం)

naku nene review

చిన్న సినిమాల్లో ఓ ప్రభంజనంలా రాబోతున్న సినిమా నాకు నేనే (తోపు-తురుం). ఈమధ్య కాలంలో చిన్న సినిమాల విజయాలు సంచలనంగా మారగా ఇప్పుడు అదే దారిలో ఈ సినిమా మంచి కథ కథనాలతో రాబోతుంది. ఇక ప్రీమియర్ షో చూసిన వారంతా ఇలాంటి మంచి ప్రయత్నం చేసినందుకు ప్రశంసలు అందిస్తున్నారు. తప్పకుండా చిన్న సినిమాల్లో ఇది పెను సంచలనంగా మారుతుందని అంటున్నారు.

కథ :

పిత్తికేసి ఎక్కడినుండో వచ్చి ఓ హోటెల్ లో సర్వర్ గా చేస్తుంటాడు. అతని మంచి తన ధైర్య సాహసాలు చూసి అందరు మెచ్చుకుంటారు. తన సాధారణ వ్యక్తిత్వంతో అందరి మనసులను తెలుచుకుంటూ వచ్చిన పిత్తికేసి సిఎంగా ప్రజానాకుడు అవుతాడు. ఈ క్రమంలో సిఎంగా గద్దెక్కిన పిత్తికేసి ఎవరు ఊహించని విధంగా మారతాడు. రకరకాల పథలాతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాడు. అసలు పిత్తికేసి అలా ఎందుకు మారాడు..? పిత్తికేసి ప్రవేశ పెట్టిన పథకాలు ఏంటి..? దాని వల్ల ప్రజలు ఎలా బాధపడ్డారు అన్నది అసలు కథ.

నటీనటులప్రతిభ :

సినిమాలో హీరోగా చేసిన అశోక్ సుంకర నటనకు అందరు ఇంప్రెస్ అవుతారు. మొదటి సినిమానే అయినా బలమైన కథ కథనాలున్న ఈ సినిమా అంతా తనపై ఫోకస్ ఏర్పరచుకున్నాడు. నిజంగా ఇది తన ప్రతిభకు తార్కాణమని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ కూడా బాగానే నటించింది. సీనియర్ నటుడు చలపతి రావు, సుమన్ శెట్టిలు మంచి పాత్రల్లో నటించారు.

ఇక సినిమా సాంకేతిక వర్గం విషయానికొస్తే.. మ్యూజిక్ పర్వాలేదు.. సినిమా ఎడిటింగ్ నందమూరి హరి మంచి ఎడిటింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు ఎంత అవసరమో అంత పెట్టారు. అయితే రిచ్ నెస్ కాస్త తక్కువయినట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక దర్శకుడు ఎంచుకున్న కథ కథనాలు ఓకే అనిపిస్తుంది. కథ మంచిగా రాసుకున్నా కథనంలో దాన్ని కాస్త పట్టు సడలించాడనిపిస్తుంది. రకరకాల పథకాలతో ప్రజలను ఆందోళను గురి చేసే సిఎం అలా ఎందుకు చేస్తున్నాడు అన్న పాయింట్ చివరి దాకా వెయిట్ చేయించడం కాస్త ఆలోచనలో పడేస్తుంది. సిఎం పిత్తికేసి ప్రవేశ పెట్టిన పథకాలు.. టకీలా పథకంతో మధ్యపానం హోం డెలివరీ.. లపాకి పథకంతో వ్యభిచారానికి లైసెన్స్ లు ఇవ్వడంతో మహిళా సంఘాలు సిఎం మీద నిరసన జ్వాలలు మొదలు పెడతారు. అయినా సరే సిఎం ఏమాత్రం తగ్గకుండా మరింతగా రెచ్చిపోయి రేషన్ లోనే ఒక్క రూపాయికే ఉఫ్ ఉఫ్ పథకంతో గంజాయి,సిగరెట్, పాన్పరాగ్,గుట్కా, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు అందిస్తూ ప్రజలకు మరింత తీవ్రస్థాయిలో ఆంధోళన వ్యక్తం చేసేలా చేస్తాడు. ఇదే సమయంలో రిజర్వేషన్ అనేది కులాలకు,మతాలకు కాదు ఆర్థిక స్థోమతను బట్టి వర్తిస్తుంది అని ప్రకటించటంతో ఒక్క సారిగా అప్పటికే విసిగి పోయిన ప్రజలు ఇక ఉండ బట్టలేక ..ప్రభుత్వానికి వ్యతిరేకంగా , నినాదాలు ,బంధులు, రాస్తారోకోలతో రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బ తీయటంతో హీరో ను అరెస్ట్ చేసి పోలీసులు కోర్ట్ లో హాజరు పరుస్తారు. ఇక అక్కడే అసలు డైలాగులు పడతాయి. సినిమాకు బలం అనుకున్న కథనం కాస్త వీక్ అయినట్టు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

కథ
కథనం
డైలాగ్స్
హీరో యాక్టింగ్

మైనస్ పాయింట్స్ :

డైరక్షన్ లోపాలు

హీరో డ్యాన్స్

ఫైట్ కంపోజింగ్

బాటం లైన్ : దేశాని మార్చే పౌరుడు ఆలోచింపచేస్తాడు..!

రేటింగ్ : 3.0/5.0