దేశాన్ని బాగుచేసే సి.ఎం అతనే.. నాకు నేనే (తోపు-తురుం)

nakunene toputurum movie

ఒక్కరోజులో దేశాన్ని బాగుచేయడమా.. అబ్బో చాలా కష్టమే అయితే రియల్ గా కష్టమేమో కాని రీల్ లైఫ్ లో అది కష్టమేం కాదు. అందుకే ఒక్కరోజులో దేశాన్ని బాగుచేసే సిఎంగా వస్తున్నాడు పిత్తికేసి. అతనెవరు అనుకోవచ్చు నాకు నేను సినిమాతో దేశాన్ని మార్చగలిగే కథ కథాంశాలతో వస్తున్నాడు. కొత్త కొత్త పథకాలే కాదు ప్రజల్ని చైతన్య పరిచే విధి విధానాలతో సినిమా తెరకెక్కించబడింది.

రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన నాకు నేనే సినిమా అంచనాలకు తగ్గట్టే సినిమా కూడా ఉంటుందని అంటున్నారు. ఈ నెల 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఓ సాధారణ ఎం.ఎల్.ఏ నుండి సిఎంగా ఎదిగిన ఓ పౌరుడు తను ఎలాంటి పథకాలతో ప్రజలను చైతన్య పరచాడు. సిఎం గా ఉండి కూడా అదే సాధారణ జీవితాన్ని గడుపుతూ ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు అన్నది రేపు తెలుస్తుంది. సినిమాలో డైలాగ్స్, ఎమోషన్స్ అన్ని సగటు ప్రేక్షకుడిని ఆలోచనలో పడేస్తాయని తెలుస్తుంది. రేపు రిలీజ్ అయ్యే నాకు నేనే నిజంగానే దేశాన్ని మార్చే అస్త్రం అవుతుందా లేదా అన్నది తెలియాలంటే మరో 24 గంటలు వెయిట్ చేయాల్సిందే.