ఎన్టీఆర్ కొత్త సినిమా న్యూస్ వింటే పిచ్చి ఖాయం.. బాహుబలికే దిమ్మ దిరిగే న్యూస్ ?

ntr-allu-arjun

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత తారక్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఆశగా ఎదురుచూసారు ఫ్యాన్స్. గ్యారేజ్ అందించిన సక్సెస్ ఊపులో ఏదో ఒక సినిమాను సెలెక్ట్ చేసుకుంటాడు అని అనుకున్నారు అందరు. కానీ వారి ఆశలపై నీళ్ళు చల్లాడు ఎన్టీఆర్. గ్యారేజ్ విడుదల కావడం, సినిమా హిట్ కావడం.. జరిగిపోయి చాలా రోజులు గడుస్తున్నా తారక్ మాత్రం ఇంకా ఎటువంటి ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. అందుకు కారణం కూడా తానే అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. గ్యారేజ్ సెట్స్‌పై ఉన్నప్పుడు తారక్‌తో సినిమా చేయడానికి క్యూ కట్టిన డైరెక్టర్స్ ఇప్పుడు వేరే స్టార్స్‌తో సినిమాలు చేసుకుంటున్నారు. దీంతో సినిమాలేమీ లేక ఖాళీగా మారాడు ఎన్టీఆర్ అంటూ ఓ వర్గం ఆడియెన్స్ తారక్‌పై కామెంట్స్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి తన నెక్ట్స్ మూవీ విషయంలో ఎన్టీఆర్ చాలా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

ఎన్టీఆర్ ఒక దిమ్మదిరిగే కాంబినేషన్ లో సినిమా కథ విన్నాడట ఆ కథ చాలా బాగా వచ్చిందంట…అది కూడా అల్లు అర్జున్ తో కాంబినేషన్ లో కనుక ఆ సినిమా చేస్తే చాలా బాగుంటుందంట. ఆ సినిమా ని వర్కవుట్ చెయ్యడానికి చర్యలు జరుగుతున్నాయంట .అసలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే మహా పిచ్చి లేస్తుంది అభిమానులకి. నందమూరి అభిమానులని, మెగా అభిమానులని వేర్వేరుగా ఉన్నప్పటికినీ అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ ఇద్దరినీ ప్రేమించే వారు, అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. అవును ఇప్పటి ట్రెండుకి తగ్గట్లు హీరోలు అభిమానుల లెక్కలు మాని ఒక మంచి కథ కోసం కనుక కలిసి పనిచేస్తే బాహుబలి లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు వస్తాయి.