అలా ఉంటె మాత్రం ఒప్పుకోను… త్రివిక్రమ్ కి తెగేసి చెప్పిన పవన్ కళ్యాణ్!!

pawan-kalyan-trivikram-srinivas

తమిళ దర్శకులతో సినిమాలు తీయడం పవన్ కళ్యాణ్ కి కొత్త విషయం ఏమీ కాదు .. అప్పట్లో సూర్య దగ్గర నుంచీ ధరణి ఇలా చాలా మందితో కళ్యాణ్ సినిమాలు తీసాడు. కానీ హిట్టు పర్సంటేజీ లో మాత్రం పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ లు అందరికంటే ముందర ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటేనే సెన్సేషన్ అని చెబుతారు ఫిలింనగర్ లో.

వీరిద్దరి సినిమా ఓకే అవ్వకుండానే మనోడు నీసన్ తో సినిమా సంతకం పెడితే ఇక ఈ సినిమా ఉండదేమో అనుకున్నారు. కానీ నిన్నటికి నిన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమా ఉండి తీరుతుంది అని ఫైనల్ చేసిన తరవాత పర్లేదు అనిపిస్తోంది. ఐతే త్రివికమ్ సినిమాను ఊరికే మొక్కుబడిగా ప్రారంభోత్సవం జరిపించేసి వదిలేయట్లేదు పవన్.ఈ సినిమా షూటింగ్ కూడా సాధ్యమైనంత త్వరగా మొదలయ్యేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమిళ కుర్రాడు అనిరుధ్ కూడా కన్ఫమ్ అయిపోయాడు.

పవన్-త్రివిక్రమ్ సినిమాకు పని చేయబోతున్నట్లు అనిరుధ్ కన్ఫమ్ చేయడమే కాదు.. త్వరలోనే పని మొదలవుతుందని కూడా వెల్లడించాడు అనిరుధ్. అంతే కాక.. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని.. ఇది విభిన్నమైన కథ అని కూడా చెప్పాడు అనిరుధ్. పవన్-త్రివిక్రమ్ అనగానే చాలా వరకు మసాలా ఎంటర్టైనర్లే ఆశిస్తారు ప్రేక్షకులు. ఐతే మొత్తం స్క్రిప్టు నరేషన్ విన్న అనిరుధ్.. ఇది చాలా వైవిధ్యమైన కథ అంటున్నాడు. ఇంతకుముందు పవన్-త్రివిక్రమ్ కలిసి ‘కోబలి’ అనే ప్రయోగాత్మక చిత్రం చేయాలనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. బహుశా దాన్నే ఇప్పుడు బయటికి తీస్తున్నారా.. ఇంకేదైనా కొత్త కథను త్రివిక్రమ్ రెడీ చేస్తున్నాడా తెలియదు కానీ.. జల్సా.. అత్తారింటికి దారేది తరహాలో ఈ సినిమా ఉండ వద్దని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కి చిన్న సైజు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.