ప్రేమమ్ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్… చైతూ‌కి స్టార్ డమ్ వచ్చేసినట్టే!!

premam-10-days-collections

ప్రేమమ్ సినిమాతో నాగచైతన్యకు సాలిడ్ మార్కెట్ అయితే క్రియేట్ అయినట్టే కనిపిస్తోంది. అలాగే మనవాడి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు చైతూ నటనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ ప్రభావం మొత్తం కలెక్షన్స్ విషయంలో కనిపిస్తోంది. ప్రేమమ్‌లో నాగచైతన్య సూపర్ పెర్ఫార్మెన్సే రిపీట్ ఆడియన్స్‌ని థియేటర్స్ వైపు రప్పిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.

అలాగే ఎక్కడా కూడా సీరియస్‌నెస్‌ అన్నదే లేకుండా కంప్లీట్‌గా కామెడీ, కమర్షియల్ అప్రోచ్‌తో ప్రేమమ్‌ని చంందూ మొండేటి తెరకెక్కించిన విధానం కూడా ఈ సినిమాకు బాగానే ప్లస్ అయింది. అన్నింటికీ మించి ప్రేమమ్ రిలీజ్ అయిన వీక్‌లో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బకెట్ తన్నేయడం, అలాగే ఈ వీక్ రిలీజ్ అయిన నాగభరణం ఫ్లాప్ అవ్వడం కూడా ప్రేమమ్‌కి భలే కలిసొచ్చింది. అందుకే 20క్రోర్స్‌ని మించి ఇంకా కలెక్ట్ చేస్తోంది ప్రేమమ్ సినిమా.

ప్రేమమ్ టెన్ డేస్ కలెక్షన్స్ డిటెయిల్స్ః

నైజాంః 5.11 Crores

వైజాగ్ః 1.8 Crores

సీడెడ్ః 2.15 Crores

ఈస్ట్ః 1.1 Crores

వెస్ట్ః 0.8 Crores

కృష్ణాః 1.25 Crores

గుంటూరుః1.4 Crores

నెల్లూరుః0.6 Crores

ఎపి అండ్ టిజిః 14.21 Crores

కర్ణాటకః 1.7 Crores

రెస్ట్ ఆఫ్ ఇండియాః 0.4 Crores

యూఎస్ఎః 3.1 Crores

రెస్ట్ ఆఫ్ వరల్డ్ః 0.4 Crores

టోటల్ః 19.81 Crores (షేర్)