మెగా స్టార్ తో పే .. ద్ద సినిమా తీస్తా – వర్మ

ram gopal varma

రామ్ గోపాల్ వర్మ తిరిగి ముంబయి వెళ్లిపోయాడు. మళ్లీ పూర్తి స్థాయిలో ఒక బాలీవుడ్ సినిమా తీయడానికి సన్నాహాలు మొదలుపెట్టేశాడు. వర్మ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ‘సర్కార్’ సిరీస్ లో ఆయన సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో ఆయన మరోసారి కొలాబరేట్ అవుతున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘సర్కార్-3’ ఆల్రెడీ సెట్స్ మీదికి వెళ్లిపోయింది. ఈ సినిమా విశేషాల్ని అభిమానులతో పంచుకోవడానికి వర్మ ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఏర్పాటు చేయడం విశేషం. అందులో ‘సర్కార్-3’ సినాప్సిస్ కూడా పెట్టేశాడు వర్మ.

సర్కార్ గత రెండు భాగాలతో పోలిస్తే.. మూడో భాగం చాలా పెద్దదని వర్మ చెప్పడం విశేషం. ఇంకా వర్మ ఏమన్నాడంటే..మార్లోన్ బ్రాండో లేకుండా ‘గాడ్ ఫాదర్’ ఊహించుకోగలనేమో కానీ.. అమితాబ్ బచ్చన్ లేకుండా సర్కార్-3 ఊహించుకోలేనంటున్నాడు వర్మ. ఆ పాత్రను ఆయన చేసినట్లు ఇంకెవరూ చేయలేరని.. అంత శక్తిమంతమైన పాత్రను ‘సర్కార్ రాజ్’లో కొంచెం బలహీన పరిచానని వర్మ అన్నాడు. అభిషేక్ బచ్చన్ క్యారెక్టర్ని చంపేయడం ద్వారా ఆ సినిమాలో అమితాబ్ శక్తిని కూడా తగ్గించేశానని వర్మ అన్నాడు. ‘సర్కార్-3’లో ఇలాంటి తప్పు చేయనని.. సర్కార్ ను మరింత శక్తిమంతంగా చూపిస్తానని అన్నాడు. ‘సర్కార్-3’ కేవలం ఫ్యామిలీ లేదా ఒక సోషల్ ఇష్యూ మీద నడవదని.. దీని కాన్వాస్ చాలా పెద్దదని వర్మ అన్నాడు. దీని కథాంశం కూడా యూనివర్శల్ అని వర్మ చెప్పాడు. ఇందులోని నెగెటివ్ క్యారెక్టర్లతో పోలిస్తే.. ‘సర్కార్’.. ‘సర్కార్ రాజ్’ల్లోని పాత్రలు తేలిపోతాయని వర్మ అన్నాడు. ఇందులో సర్కార్ అనేక పెద్ద సమస్యల్ని డీల్ చేస్తాడని చెప్పాడు. ఇలా ‘సర్కార్-3’ విషయంలో తన విజన్ ఏంటో చెప్పిన వర్మ.. ఇందులోని పాత్రల్ని కూడా పరిచయం చేశాడు.