విజయ్ మాల్యా కి చుక్కలు చూపించ బోతున్న రామ్ గోపాల్ వర్మ !

vijay-malya-ram-gopal-varma

సంచలనాలకు మారుపేరు వర్మ… సంచలనాలు చేయాలని ఆయన అలా చేస్తారో లేక ఆయన చేశారు కాబట్టి సంచలనమవుతుందో అని అంటే… రెండోదానికే ఎక్కువమంది ఓటు వేస్తారు. ట్విట్టర్ ద్వారా ప్రపంచలో జరిగే చాలా విషయాలపై తనదైన స్పందనను తెలియజేసే వర్మ – ఇక సినిమాల విషయానికొస్తే కీలమైన అంశాలను ఎత్తుకుంటారు. వాటిని వివాదాస్పద అంశాలని కూడా అంటారనుకోండి అది వేరే విషయం. అయితే తాజాగా వర్మ బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యా ను కూడా టార్గెట్ చేసినట్లున్నారు. సర్మార్ 3 హడావిడిలో ఉన్న వర్మ… ఈ సినిమాలో మాల్యా పేరున ఒక భారీ క్యారెక్టరే ప్లాన్ చేసినట్లుంది!!

ప్రస్తుతం తెలుగులో తన కొత్త సినిమా (చివరిది కూడా అని ప్రకటించాడు) “వంగవీటి”తో తెలుగు నాట పెద్ద వివాదమే రాజేయబోతున్నాడని ఇంకా గట్టిగా చెప్పాలంటే దాని విడుదలే ప్రశ్నార్ధకమా అనే అనుమానాలు ఆ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. ఇక వర్మ చాలా కాలం తర్వాత బాలీవుడ్లో తెరకెక్కించబోయే “సర్కార్-3” లోనూ సెన్సేషన్ క్రియేట్ చేయడానికే చూస్తున్నాడని తాజా పరిషితులను బట్టి అర్థమైపోతుంది.
వర్మ – బిగ్ బి కాంబినేషన్ లోని “సర్కార్-3” గురించి అధికారిక సమాచారాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఏర్పాటు చేసిన పోర్టల్లో సినిమా సినాప్సిస్ ఏంటో బ్రీఫ్ గా చెప్పే ప్రయత్నం చేసిన వర్మ… దాంతో పాటు ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్ని కూడా పరిచయం చేశాడు. అమితాబ్ ఎప్పట్లాగే సుభాష్ నాగ్రే అలియాస్ సర్కార్ గా కనిపించబోతుండగా మరో కీలకమైన పాత్రలో జాకీష్రాఫ్ నటించబోతున్నాడు.. ఆ పాత్ర పేరు మైకేల్ వాల్యా! ఒకప్పుడు అండర్ వరల్డ్ సామ్రాజ్యంలో ఉండి ఆ తర్వాత లండన్లో బిజినెస్ మ్యాన్ గా సెటిలైన క్యారెక్టర్ ఈ మైకేల్ వాల్యాది. దీంతో ఈ పాత్ర విజయ్ మాల్యాను ఉద్దేశించి పెట్టిందని జనం ఫిక్సయిపోతున్నారట.