దుప్పట్లు కప్పుకుని మరీ డాన్స్ చేస్తున్న రకుల్, సాయి ధరమ్ తేజ్ (వీడియో)

sai dharam tej rakul preet singh supreme video

ఎండనక వాననక చలనక ప్రేక్షకులను అలరించడానికి నటీనటులు ఎన్నో కష్టాలుపడి ఇబ్బందులను ఎదుర్కొని షూటింగులు చేస్తారనేది చాలా మందికి తెలిసిన విషయమే. ఎముకలు కొరికే చలైనా మండుటెండయినా వానపాటలో రోజంతా నానినా… తెరపై కనిపించినప్పుడు ఆ కష్టం అంతా మరిచిపోతారని చెబుతుంటారు కూడా. ఇదే క్రమంలో తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ – సాయిధరం తేజ్ లు ఎముకలు కొరికే చలిలో పడిన ఇబ్బందులకు సంబందించిన ఒక వీడియో విడుదలయ్యింది.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ – రకుల్ ప్రీత్ సింగ్ లు “విన్నర్” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతోంది. దీనికి సంబంధించి వీడియో ఒకటి యూనిట్ లేటెస్ట్ గా రిలీజ్ చేసింది. ఆ ప్రాంతంలో చలి ఏ రేంజ్లో ఉందో ఈ వీడియో చెప్పకనే చెబుతుంది. ఈ వీడియోలో దుప్పట్లు కప్పుకున్న తేజు – రకుల్ లు డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది.

కాగా మలినేని గోపిచంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2017 ఫిబ్రవరి చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట!