మళ్ళీ సల్మాన్ ఖాన్ కోర్టు , పోలీసులు , జైలు!!

salman-khan-court-struggles

బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాజ్యం ఏలుతున్నా కూడా సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన కేసుల వ్యవాహారం లో తలనొప్పులు పడుతూనే ఉన్నాడు. కేసుల సంఖ్యా రోజు రోజుకూ పెరుగుతూ రావడం వాటిని సల్లూ తగ్గించుకోవడం ఇదే పని అయిపొయింది. 1998లో జోధ్ పూర్ కు సమీపంలోని భావద్ – మథానియా ప్రాంతాల్లో ఓ కృష్ణజింకను – ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. సల్మాన్ పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 కింద ఈ కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబందించి ఈ ఏడాది జూలై 25న ఆ రాష్ట్ర హైకోర్టు సల్మాన్ నిర్ధోషి అంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

అంతకముందు ట్రయల్ కోర్టు సల్మాన్ ను ఈ కృష్ణజింకల కేసుకు సంబందించి దోషిగా నిర్ధారించి.. ఒక కేసులో ఏడాది జైలు శిక్ష – మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
దీనిపై సల్మాన్ సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకోగా మిథానియా కేసులో సల్మాన్ అప్పీలును తిరస్కరించిన కోర్టు – భావద్ కేసును మాత్రం హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే ఈ విషయంలో సరైన సాక్షాలు లేవని సల్మాన్ ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు తీర్పు అనంతరం రకరకాల కామెంట్స్ వినిపించాయి. అయితే తాజాగా ఆ కేసులో తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కండల వీరుడికి కృష్ణజింకల కష్టాలు ఇప్పట్లో తప్పేలా లేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి!