న్యూడ్ గా నటిస్తా.. తప్పేంటి? మీడియాకు చుక్కలు చూపించిన సనా ఖాన్!!

kalyanram-heroine

సనా ఖాన్ అనే ఓ బ్యూటీ ఉంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సోయగంతో మంచి పరిచయమే ఉంది. అప్పట్లో కళ్యాణ్ రామ్ కత్తిలోనూ.. ఆ తర్వాత నాగార్జున మూవీ గగనంలో దర్శనం ఇచ్చిన ఈ భామకు.. ఆ తర్వాత మిస్టర్ నూకయ్యలో మనోజ్ సరసన ఓ ఛాన్స్ వచ్చింది. తమిళ్ లోనూ హిందీలోనూ సినిమాల కౌంట్ బాగానే ఉన్నా.. కెరీర్ పరుగులు పెట్టిన పాపాన పోలేదు.

ఎంత గ్లామర్ డోస్ చూపించినా బ్రేక్ రాకపోవడంతో.. ఇప్పుడు అడల్ట్ కంటెంట్ సినిమాల్లోకి జంప్ అయిపోయింది. వజహ్ తుమ్ హో అనే సినిమాలో రెచ్చిపోయి నటించగా.. డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఆ మూవీలో బెడ్ రూమ్ సీన్స్ లోనూ.. స్కిన్ షో లోనూ అంతగా రెచ్చిపోయావేంటి సనా ఖాన్ అనే ప్రశ్న ఈమెకు ఎదురైంది. దీనికి అమ్మడు ఇచ్చిన ఆన్సర్ దెబ్బకు.. వినేవాళ్లకు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది.

‘మన సినిమాలు హాలీవుడ్ రేంజ్ లో ఉండాలని అనుకోవడమే కానీ.. ఆ రేంజ్ లో గ్లామర్ చూపిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నాం. మన ఐడియాలజీ మారాల్సింది చాలా ఉంది. నేనైతే నగ్నంగా నటించేందుకు కూడా రెడీ. ఓ యాక్ట్రెస్ గా అలా చేయడంలో తప్పేంటట? రీసెంట్ గా పార్చెడ్ లో రాధికా ఆప్టే కనిపించలేదా’ అంటోంది సనా ఖాన్. యాక్టింగ్ లో ఎవరితోనూ పోల్చుకునేందుకు ఏ హీరోయినూ ఇష్టపడదు కానీ.. ఎక్స్ పోజింగ్ లో మాత్రం ఎగ్జాంపుల్స్ బాగా దొరుకుతాయ్!