అక్కడ యంగ్ టైగర్ ఫాలోయింగ్ కేక !!

ntr-hattrick

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ “జనతా గ్యారేజ్” సినిమా ఇప్పటికే క్రియేట్ చేసిన రికార్డుల సరసన మరో రికార్డు వచ్చి చేరింది. తెలుగులో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. అలా అని ఎన్టీఆర్ అభిమానులు తెలుగులోనే ఉన్నారని అనుకుంటే పొరపాటే. ప్రతీ హీరోకీ మిగిలిన రాష్ట్రాల్లో కూడా చెదురుమదురుగా ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఈ విషయంలో కర్ణాటకలో ఎన్టీఆర్ కు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ విషయాన్ని తాజాగా మరోసారి “జనతా గ్యారేజ్” నిరూపించింది.

ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఎన్టీఆర్ “జనతా గ్యారేజ్” వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. వీటిలో శాండిల్వుడ్ వాటా కూడా బాగానే ఉంది. కర్ణాటక లో ఈ సినిమా 8.6 కోట్ల షేర్ సాధించింది. కర్ణాటకలో విడుదలయిన తెలుగు సినిమాల్లో “బాహుబలి” తర్వాత స్థానంలో జనతా నిలిచింది. అలా అని ఈ ఒక్క సినిమాకే అనుకునేరు… కర్ణాటకలో రూ.5 కోట్లకు పైగా షేర్ సాదించిన సినిమాలు యంగ్ టైగర్ కు వరుసగా మూడు ఉన్నాయి. ఈ విషయంలో కర్ణాటకలో ఐదు కోట్లకు పైగా షేర్స్ సంపాదించిన సినిమాల విషయంలో జూనియర్ హ్యాట్రిక్ సాధించారనే చెప్పాలి.

కర్ణాటకలో 5కోట్ల కు పైగా షేర్ షాధించిన సినిమాల్లో జూనియర్ సినిమాల్లో టెంపర్ 5.12 కోట్లతు నన్నకు ప్రేమతో 6.18 కోట్లు షేర్స్ సాధించాయి. వాటి సరసన హ్యాట్రిక్ కొడుతూ తాజా బ్లాక్ బాస్టర్ “జనతా గ్యారేజ్” 8.62 కోట్లతో నిలిచింది. ఇదే సమయంలో కన్నడ స్టార్ హీరో పునీ రాజ్ కుమార్ తన సినిమాకోసం యంగ్ టైగర్ ను పాట పాడమని అడిగాడంటే… కర్ణాటకలో జూనియర్ కి ఉన్న ఫాలోయింగ్ ని ఇట్టే అంచనా వేయొచ్చు.