అతని తో ఎన్టీఆర్ బిజీ బిజీ!!

ntr

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో.. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన రేంజ్ ఏంటో చాటి చెప్పాడు. నెంబర్ గేమ్ విషయంలో యంగ్ టైగర్ కి పెద్ద పట్టింపులు కానీ.. ఈ స్టార్ హీరో స్టేటస్ పై అనుమానాలు ఎవరికీ లేవు కానీ.. ఇండస్ట్రీ హిట్ కొట్టలేదనే కొరతని భారీ బ్లాక్ బస్టర్ తో తీర్చేశాడు ఎన్టీఆర్. మరి ఆ తర్వాత సంగతేంటి? జూనియర్ ఇప్పుడేం చేస్తున్నాడు? ఏం చేయబోతున్నాడు?

హిట్ కొట్టిన ఆనందంలో.. రీసెంట్ గా తన కుటుంబంతో కలిసి థాయ్ లాండ్ టూర్ కి వెళ్లాడు ఎన్టీఆర్. కాస్త ఎక్కువ టైమ్ నే బ్యాంకాక్ లో ఎంజాయ్ చేసేందుకు కేటాయించేశాడు. రీసెంట్ గా తిరిగి హైద్రాబాద్ వచ్చీ రాగానే కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని అన్నారు కానీ.. అది కూడా జరగలేదు. మరి ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడబ్బా అంటే.. తన జూనియర్ కి అ..ఆ..లు ఏబీసీడీలు దగ్గరుండి నేర్పిస్తున్నాడట. వీలైనంత ఎక్కువ టైమ్ ని కొడుకు అభయ్ రామ్ కేటాయిస్తున్నాడని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే పూరీతో ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందనే టాక్ ఉన్నా.. అది కళ్యాణ్ రామ్-పూరీల ఇజం రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పూరీ కాకపోయినా.. ఎన్టీఆర్ దగ్గర 2 – 3వేరే పెద్ద డైరెక్టర్ల ఆప్షన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఏ సంగతీ దీపావళి లోపే తేలిపోనుందని టాక్.