ఎన్టీఆర్ ఇక బిందాస్.. అంతా మార్చేశాడు!!

young-tiger-ntr-demand

చిన్న వయసులోనే బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మళ్ళీ తన పూర్వపు వైభోగాన్ని మూడు వరుస హిట్లతో అందుకోవటమే కాకుండా, జనతా గ్యారేజ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి తన సత్తా మరోసారి చాటి చెప్పాడు. అయితే ఆ సినిమా కంప్లీట్ అయ్యి దాదాపుగా రెండు నెలలు దాటింది. కానీ ఎన్టీఆర్ తన తర్వాత సినిమాపై ఇంతవరకు ప్రకటన చెయ్యలేదు.. అలాగే నిర్ణయం తీసుకున్న వార్తలు కూడా రావడం లేదు. కానీ సోషల్ మీడియా మరియు వెబ్ మీడియా లో మాత్రం రోజుకో వార్త హల్ చల్ చేస్తుంది. నిజానిజాలు ఎలా ఉన్నా ఎన్టీఆర్ మాత్రం ఆవేశపడకుండా చాలా జాగ్రత్తగా తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది.

తాను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ దర్శకుడు అయినా తన దగ్గరికి రావాలి.. కానీ స్టార్ డైరెక్టర్లు అందరూ తమ తమ ఇతర కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నారు.ఎప్పుడూ ఉండే సినిమాలేకదా.. ఇప్పుడు కొంత సమయం దొరికింది కాబట్టి తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని ముఖ్యంగా కొడుకు అభయ్ తో ఎక్కువగా సమయం గడపాలనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మంచి కథ.. మంచి దర్శకుడు సెట్ అయ్యేంతవరకు గాబరా లేకుండా ప్రశాంతంగా ఉండాలని..ఇతర వ్యాపకాలపై కూడా దృష్టి పెట్టినట్లుగా సమాచారం. ఏది ఏమైనప్పటికిని ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో … ఏ ప్రకటన వస్తుందో అని టెన్షన్ టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో…